ఆదిబట్ల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిబట్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆదిబట్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆదిబట్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

ఆదిబట్ల 34.079 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°13′55″N 78°32′35″E / 17.232°N 78.543°E / 17.232; 78.543 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15453 మంది కాగా, అందులో 8076 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. 4139 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు

  1. "Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Retrieved 2021-03-24.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 24 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 24 March 2021.
  4. "Basic Information of Municipality, Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Retrieved 24 March 2021.

వెలుపలి లంకెలు