ఆదిలాబాద్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిలాబాదు పురపాలక సంఘం,తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రెండవ తరగతికి చెందిన మునిసిపాలిటీ.అదిలాబాదు పట్టణం జిల్లా కేంద్రం.

ఆదిలాబాదు మునిసిపాలిటీలో 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 117,167 జనాభాతో 20.76 చ.కి. లో విస్తరించి ఉంది.పట్టణంలో మగవారి సంఖ్య 59,448, మహిళలు సంఖ్య 57,719.[1]మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య 12993. ఇది ఆదిలాబాద్ మండలం మొత్తం జనాభాలో 11.09%. ఆదిలాబాద్ మునిసిపాలిటీలో ఆడ వారి నిష్పత్తి రాష్ట్ర సగటు 993కు వ్యతిరేకంగా 971గా ఉంది. అంతేకాక ఆదిలాబాదులో బాలల నిష్పత్తి 932 గా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే. ఆదిలాబాద్ నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కన్నా 78.74% ఎక్కువ. ఆదిలాబాద్‌లో పురుషుల అక్షరాస్యత 85.84% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.46%. ఆదిలాబాద్ మునిసిపాలిటీలో మొత్తం 25,840 ఇళ్లు కలిగి ఉన్నాయి.వీటికి మంటినీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను సమకూరుస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోని రహదారులను నిర్మించడానికి, నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించే అధికారం పురపాలక సంఘానికి చట్టం ద్వారా అధికారాలు సంక్రమించబడ్డాయి.

మూలాలు

  1. "Adilabad City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-01-29.

వెలుపలి లంకెలు