దంతపురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చారిత్రక నేపద్యము

దంతపురి అనే గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నుండి హిరమండలం వెళ్ళే మార్గములో కలదు. ఇది ఆమదాలవలస పట్టణానికి 10 కి.మీ మరియు శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ దూరంలో కలదు. ఈ ప్రాంతములో పురాతన బౌద్ధ స్థూపములు కలవు. ఈ ప్రాంతములో బౌద్ధ మతస్థులు నివసించేవారని ప్రతీతి. ఇది ముఖ్యమైన పురాతన భౌద్ధ ప్రదేశం. ఇది బుద్ధ జ్ఞాన దంతపురి గా పిలువబడుతుంది. పురాతత్వ పరిశోధకులు ఇచట కొన్ని ఇటుకలు,కుండలు,టెర్రాకోటా పాత్రలు,గాజులు మరియు రాతి,ఇనుప వస్తువులను కనుగొన్నారు. క్రీ.ఫూ 261 కళింగయుద్ధం తర్వాత ఈ పప్రాంతం భౌద్ధ ప్రదేశంగా ప్రశిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని కళింగ రాజులు తమ మత రాజధానిగా భావించేవారు. బుద్ధుని నిర్యాణం తర్వాత అతని జ్ఞానదంతం అర్హఖేరుతేరుడు ద్వారా కళింగ రాజైన బ్రహ్మ దత్తకు అందజేయబడినది. బ్రహ్మదత్తుడు ఈ దంతమును భూస్థాపితం చేసి దానిపై ఒక స్థూపమును నిర్మించినాడని ప్రతీతి. ఈ ప్రాంతంలో బుద్దుని జ్ఞానదంతం ఉన్నందున ఈ ప్రాంతము దంపపురి గా పిలువబడుతుంది.

దస్త్రం:Buddha-danthapuri.jpg
బుద్ధ విగ్రహం
దస్త్రం:Danthapuri-budda.jpg
దొన్ని వస్తువులు
దస్త్రం:Danthapuri-objects.jpg
పురాతన వస్తువులు
"https://te.wikipedia.org/w/index.php?title=దంతపురి&oldid=767070" నుండి వెలికితీశారు