భౌతిక శాస్త్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భౌతిక శాస్త్రము అంటే ఏమిటి?

భౌతిక శాస్త్రము (ఆంగ్లం: Physics) అంటే ఏమిటి? పదార్థము (మేటర్), శక్తి (ఎనర్జీ) అనే రెండింటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని అధ్యయనం చేసేదే భౌతిక శాస్త్రం. శక్తి యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే భౌతిక శాస్త్రం. ఈ శక్తి మనకి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇది చలన రూపంలోను, వేడి రూపంలోను, వెలుగు రూపంలోను, విద్యుత్ రూపం లోను, వికిరణం రూపంలోను, గురుత్వాకర్షణ రూపంలోను – ఇలా అనేక రూపాల్లో మనకి తారసపడుతూ ఉంటుంది.

భౌతిక శాస్త్రం అంటే మన చుట్టూ వున్న ప్రకృతిలో అనేకమైన దృగ్విషయాలను గురించిన అధ్యయనం. భౌతిక శాస్త్రము విశ్వములో మౌలిక పదార్థములు, వాటి మధ్య ప్రాథమిక చర్యలను క్షుణ్ణంగా అర్థము చేసుకునే మౌలిక సూత్రాలను కూడా వివరించి, ఆ సూత్రములను బట్టి వ్యవస్థలను (systems) విశ్లేషించును.[1]

భౌతికశాస్త్రము విశ్వము యొక్క అన్ని అంతర్భాగములను - క్వాంటమ్ మెకానిక్స్ తో అణువుల మధ్య చర్యలతో సహా వివరించును కనుక, భౌతిక శాస్త్రమును 'విజ్ఞాన శాస్త్రపు పునాది' అని, ఈ పునాది పై రసాయన శాస్త్రము, భూగోళ శాస్త్రము, జీవ శాస్త్రము, సామాజిక శాస్త్రములు ఉన్నవని భావించవచ్చును. మూల భౌతిక శాస్త్రములో ఆవిష్కరణల ప్రభావము విజ్ఞాన శాస్త్రములో అన్ని శాఖల పై పడును.

భౌతిక శాస్త్రము అత్యంత ప్రాచీనమైన శాస్త్రాలలో ఒకటి. 17వ శతాబ్దం నాటికి భౌతిక శాస్త్రం ఒక ఆధునిక శాస్త్రముగా ఆవిర్భవించింది. ఇందులో అత్యంత ప్రాచీనమైన ఉపశాస్త్రము ఖగోళశాస్త్రం (Astronomy) అని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో పని చేసేవారిని "భౌతికశాస్త్రవేత్తలు" (Physicists) అంటారు.

భౌతిక శాస్త్రంలోని అభివృద్ధి తరచుగా సాంకేతిక విభాగంలోకి అనువదింపబడినా, అప్పుడప్పుడు దీని ప్రభావము ఇతర శాస్త్రాలపైనే గాక గణిత శాస్త్రముపైన, స్థూలసూక్ష్మజ్ఞానము పైన (Philosophy) పైన కూడా గలదు. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్త్వం (Electromagnetism) యొక్క అవగాహనలోని అభివృద్ధి వలన దూరదర్శిని (Television), కంప్యూటరు (Computer), వగైరా విద్యుత్పరికరాలు విరివిగా వాడుకలోకి వచ్చినవి; తాపగతిశాస్త్రం (thermodynamics) లోని అభివృద్ధి మోటరు వాహన ప్రయాణాభివృద్ధికి దారితీసింది. యంత్రశాస్త్రములోని (Mechanics) అభివృద్ధి కాల్కులస్ (calculus), గుళిక రసాయన శాస్త్రముల (quantum chemistry) అభివృద్ధికి, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వంటి సాధనముల ఉపయోగానికి దారి తీసింది.

నేడు, భౌతికశాస్త్రం చాలా బాగా అభివృద్ధి చెందిన శాఖ. ఇందులో జరిగే పరిశోధనను నాలుగు విభాగాలలో విభజించవచ్చు: ఘనీభవించిన పదార్థ భౌతికశాస్త్రం (condensed matter physics), అణు, బణు, దృష్టి సంబంధిత భౌతికశాస్త్రం (atomic, molecular, and optical physics), ఉన్నత శక్తి భౌతికశాస్త్రం (high-energy physics), నక్షత్రభౌతికశాస్త్రం (astronomy).

భౌతికశాస్త్ర శాఖలు

భౌతికశాస్త్ర సంస్థానాల ముఖ్య పథ్యాలు

భౌతికశాస్త్రం వివిధ విశాల ఉత్పాతముల కలయికైనప్పటికీ దాని ప్రధానమైన శాఖలు మొదటి తరం యంత్రశాస్త్రము (classical mechanics), విద్యుదయస్కాంతత్వం (దృష్టి విషయముతో), సాపేక్ష వాదం (relativity), తాపగతిశాస్త్రం, గుళిక శాస్త్రం (quantum mechanics). ఈ నూతన ప్రసంగాలలో ప్రతి ఓక్కటీ అనేక శోధనలలో పరీక్షించబడి ప్రకృతిలో వాటి ప్రబలమైన ప్రదేశాలలో ఖండితమైన సవుతుగా నిరూపింపబడినవి . ఉదాహరణకు, మొదటి తరం యంత్రశాస్త్రము దినదినానుభూతిలో వస్తువుల గతిని సరిగా వర్ణిస్తుంది కాని అణు ప్రమాణమున గుళిక శాస్త్రముచే కొట్టుబడిపోతుంది, అదే కాంతి వేగం చేరుకునేప్పటికి సాపేక్షస్థితి గుణములు ముఖ్యమౌతాయి. ఈ వాదాలు చాలా కాలంగా బాగా అర్ధమైనను ఇవి యెడతెగకుండా చురుకైన పరిశోధనా ప్రదేశాలుగా ఉన్నాయి. ఉదాహరణకు, మొదటితరం యంత్రశాస్త్రంలో ఒక ఆశ్చర్యకర అంశమైన ఏక సంకర వాదాన్ని (chaos theory) 20వ (20th) శతాబ్దంలో అంటే ఐస్సాక్ న్యూటను (1642-1727) (1642-1727) యంత్రశాస్త్ర ఆదిమ రూపావిష్కరణ చేసిన 3 శతాబ్దాల తరువాత అభివృద్ద్ధి చేశారు. ఈ ప్రధానాంశములైన వాదాలు మరింత ఘనమైన విషయాల పరిశీలన, పరిశోధనకు ఆధారముగా ఉపయోపడును.

మొదటి తరం యంత్రశాస్త్రము

మొదటి తరం యంత్రశాస్త్రము వస్తువుల మీద ప్రసరించే బలముల (forces) యొక్క భౌతిక లక్షణమును అధ్యయనం చేసింది. దీనిని తరచుగా "న్యూటోన్ యొక్క యంత్రశాస్త్రము" (Newtonian Mechanics) అని ఐస్సాక్ న్యూటను పేరుతో, ఆయన చెప్పిన గమన శాశనాలతో (laws of motion) జత చేర్చి చెప్పెదరు. యంత్రశాస్త్రమును మూడు భాగాలుగా చేస్తే మొదటిది స్టాటిక్స్ (statics) అనగా గమనము, చలనము లేని వస్తువుల లక్షణమును అధ్యయనం చేసేది, రెండవది కినమాటిక్స్ (kinematics) అనగా గమనములోనున్న వస్తువుల వస్తువుల లక్షణమును అధ్యయనం చేసేది, మూడవది డైనమిక్స్ (dynamics) అనగా బలముకు లోబడ్డ వస్తువుల చలన లక్షణమును అధ్యయనం చేసేది. యెడతెగని మార్పుచెందే వస్తువుల యంత్రశాస్త్రమును కంటిన్యువం యంత్రశాస్త్రం (continnum mechanics) అని అంటారు ఇందులో పదార్థ స్థితిబట్టి దృఢ యంత్రశాస్త్రము (solid mechanics), ద్రవ్య యంత్రశాస్త్రము (fluid mechanics) అని విభజించవచ్చు. ద్రవ్య వాయువ్య యంత్రశాస్త్రములో హైడ్రోస్టాటిక్స్ (hydrostatics), హైడ్రోడైనమిక్స్ (hydrodynamics), న్యూమాటిక్స్ (pnuematics), ఏరోడైనమిక్స్ (aerodynamics),, ఇతర రంగములు ఉన్నాయి.

భారత పురాణాలలో యంత్ర శాస్త్రం

యంత్ర శాస్త్రం: ఈ గ్రంథం భరద్వాజ ప్రణీతము: భూమిపై ప్రయాణానికుపయోగమైన 339 వాహనాలు, నీటిపై చరించడానికికి 783 రకా పడవలు, 101 విదాలైన గాలిలో ప్రయాణించ గలిగే వాహనాల వివరాలు చెప్పబడ్దాయి. గంధర్వులు ఉపయోగించిన వాహనాల వివరాలు కూడా ఇందులో వివరించ బడ్డాయి.

అనాథ పేజీలకి లంకెలు

మూలాలు

  1. "physical science - Britannica Concise" (all physical sciences), Britannica Concise, 2006, Concise.Britannica.com web page: CBritannica-phys-science Archived 2007-09-15 at the Wayback Machine.

ఇవి కూడా చూడండి

వనరులు