శిష్టా వేంకట సీతారామ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.

వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ. మరియు మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.