వినోబా భావే: కూర్పుల మధ్య తేడాలు

→‎సంఘ సంస్కర్తగా: అక్షరదోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
 
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. తర్కంలేని అతి గాంధీవాదం వినోబాది అని ప్రముఖ సాహితీవేత్త [[విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్|వి. ఎస్. నైపాల్]] విమర్శించాడు. కాని, భారతీయ ఆర్థిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నైపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు కూడా వచ్చాయి.
 
== భూదానోద్యమ ప్రారంభం ==
1951 ఏప్రిల్ 18 న యాదాద్రి భువనగిరి జిల్లాలో [[వినోబా భావే]] పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటి సారి [[భూదానోద్యమం]] ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి ''భూదాన్ పోచంపల్లి'' అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల (సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు) భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే [[వెదిరె రామచంద్రారెడ్డి]] అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో, భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.<ref>Bhoodan and the Landless, S.V. Khandewale and K.R. Nanekar, Popular Prakashan, 1973.</ref><ref>India since independence - bipin Chandra</ref>
 
==ప్రతిభకు పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/వినోబా_భావే" నుండి వెలికితీశారు