మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 48: పంక్తి 48:


==చిత్రాల గ్యాలరీ==
==చిత్రాల గ్యాలరీ==
File:Srinivas mimicry.JPG|thumb|వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్
[[File:Srinivas mimicry.JPG|thumb|వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్]]
File:Srinivas show 1.JPG|thumb|అభినందన సభలో వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్
[[File:Srinivas show 1.JPG|thumb|అభినందన సభలో వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్]]
File:Srinivas sanmanam.JPG|thumb|స్థానిక బాపూజీ కళామందిర్ లో నన్మాన దృశ్యం
[[File:Srinivas sanmanam.JPG|thumb|స్థానిక బాపూజీ కళామందిర్ లో నన్మాన దృశ్యం]]
File:Srinivas sanmanam1.JPG|thumb|శ్రీనివాస్ దంపతులకు సన్మానం
[[File:Srinivas sanmanam1.JPG|thumb|శ్రీనివాస్ దంపతులకు సన్మానం]]
File:Srinivas award.jpg|thumb| honored as mimicry samrat
[[File:Srinivas award.jpg|thumb| honored as mimicry samrat]]

17:13, 22 అక్టోబరు 2012 నాటి కూర్పు

దస్త్రం:Mimicrysrinivas.png
మిమిక్రీ శ్రీనివాస్

పరిచయం

సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి
శ్రీకాకుళం నకు చెందిన శ్రీ వేదుల ప్రభాకర శ్రీనివాస్. ఈయన 'మిమిక్రీ శ్రీనివాస్ ' గా సుపరిచితులు.మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు.
ఈయన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు అయిన లోకనాథం నందికేశ్వరరావు గారి శిష్యులు. గత రెండు దశాబ్దాలుగా ఆయన అనన్య ప్రతిభాపాటవాలతో దేశ,విదేశాలలో ఖ్యాతి పొందారు.
ఆయన యిప్పటి వరకు సుమారు రెండు వేల ప్రదర్శనలిచ్చారు.

బాల్యం-విద్యాభ్యాసం

శ్రీ వేదుల సీతారామమూర్తి,శ్రీమతి మధుకెశ్వేరమ్మ దంపతులకు నవమ గర్భముక్తాఫలం చిరంజీవి వేదుల ప్రభాకర శ్రీనివాస్,బి.ఎ పట్టబద్రుడు.పస్తుతం మిమిక్రీ శ్రీనివాస్ గా పేరుపొందిన ఈయన 1982 లో ముఖానికి రంగు పూసుకొని " మిమిక్రీ కళా రంగంలోకి ప్రవేశించారు.అప్పటి నుంది మిమిక్రీ కళాకారునిగా ఎదగాలని ఆయన మదిలో మెదిలింది. శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారిని స్ఫూర్తిగా తీసుకొన్న ఆయన గురువు లేని విద్య రాణించదనె సంకల్పంతో ప్రముఖ కళాకారులైన శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారి వద్ద శిష్యరికం చేసి మిమిక్రీ కళలో ఎన్నో మెళుకువలు తెలుసుకొని గురువుకు తగ్గ శిష్యునిగా రాణిస్తూ 1984 నుంది 1994 వరకు ఒక దశాబ్ద కాలం ప్రఖ్యాత బ్యాండు పార్టీ నిర్వహకుడు అయిన శ్రీ చింతలపూడి నర్శింహులు గారి వద్ద వ్యాఖ్యాతగా పనిచెసారు. ప్రముఖ నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు గారు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో 1988 లో విజయవాడలో ఆయన యెదుట వారి గొంతును అనుకరించి ప్రశంసలు పొందారు. ఇక వెంట్రిలాక్విజం (మాట్లాడే బొమ్మ) ప్రక్రియకు ప్రేరణ "ఇది కథ కాదు" చిత్రంలోని కమలహాసన్ పాత్ర. ఆ ప్రక్రియకు ఆకర్షితుడై 1992 లో ముంబయి నుండి బొమ్మ తెప్పించుకొని తన గురువు నందికేశ్వర రావు వద్ద పెదవులు కదపకుండా బొమ్మ మాట్లాడుతుందనె భ్రమ కలిగించే ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు. 1998 నాటికి 1000 ప్రదర్శనలిచ్చి సహస్ర గళార్చన పూర్తి చేసారు. 1999 లో ఎన్.టి.ఆర్ హైస్కూల్ , తిలక్ హాలు లో 12 గంటల ప్రదర్శన, 2002 మార్చి 12,13 తేదీలలో బాపూజీ కళామందిర్ శ్రీకాకుళంలో 25 గంటలు ఏకబిగిన ప్రదర్శననిచ్చి ఆబాలగోపాలం అందరి ప్రశంసలకు పాత్రులైనారు. దేశం నలు మూలల్లో వీరి ప్రదర్శనలు జరిగాయి.భారత దేశంలో ప్రముఖ పట్టణాలైన ఢిల్లీ, ముంబయి,కలకాత్తా ,బళ్ళారి,కొచ్చిన్,భువనేశ్వర్,కటక్,బరంపురం,పర్లాఖిముడి,సూరత్,బరోడా,అహ్మదాబాద్, ఖర్గపూర్,రాయపూర్,రాయిఘర్,సింధునూర్,బాల్కో,పూనె,నాగపూర్,వంటి ప్రదేశాలలో ప్రవాసాంధ్రుల సంఘాలలో ప్రదర్శనలిచ్చి తెలుగువారి పురస్కారాలు ఎన్నో పొంది ఉన్నారు. 2006 నవంబర్ 17 న దుబాయిలో యిచ్చిన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి వీరి విజయ ప్రస్థానం ప్రారంభించబడింది. 13 దేశాలలో తన ప్రదర్శనను ప్రదర్శించి తెలుగు వారి గౌరవాన్ని యినుమడింప జేసారు.యిలా వీరి విజయ ప్రస్థానంలో 30 సంవత్సరములు పూర్తి చెసుకున్న సందర్భంగా శ్రీకాకుళం గర్వించ దగ్గ కళాకారునిగా వీరిని సత్కరించటం కనీస బాద్యతగా భావించి "చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్" ఆద్వర్యంలో తే.07.10.2012 ది. న జిల్లావాసులు ఘనంగా సత్కరించారు.

అవార్డులు,పురస్కారాలు,సత్కారాలు

  • అక్టోబర్ 2,1999 లో అవిశ్రాంతంగా 12 గంటల వెంట్రిలాక్విజం షో నిర్వహించి రికార్డు సాధించారు.
  • మార్చి 2002 లో శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ లో 25 గంటలు అవిశ్రాంతంగా మిమిక్రీ,వెంట్రిలాక్విజం చేసి ప్రపంచ రికార్డు సాధించారు.
  • 2003 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ జె.ఆర్.పుష్పరాజ్ చే సత్కరించబడ్డారు.
  • 1998 లో 1000 ప్రదర్శనలు పుర్తి చేసిన సందర్భంగా స్థానికంగా సన్మానించబడ్డారు.'
  • 1997 లో భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా విశాఖపట్టణంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ సమక్షంలో విధ్యార్థులకు ఉచిత ప్రదర్శన లిచ్చారు.
  • 1994 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.జనార్థనరెడ్డి చేతుల మీదుగా సత్కరించబడ్డారు.
  • 1988 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు చేతుల మీదుగా సత్కరించబడ్డారు.
  • దేశంలో వివిధ రాష్ట్రాలలో అనెక ప్రదర్శనలిచ్చారు.

విదేశాలలో ప్రదర్శనలు

శ్రీ వేదుల ప్రభాకర శ్రీనివాస్ గారు (మిమిక్రీ శ్రీనివాస్) 13 దేశాలలో ప్రదర్శనలిచ్చారు.

  • 2006 లో రసమయి తెలుగు ఫోరం అధ్వర్యంలో దుబాయి లో ప్రదర్శన.
  • 2007 లో తెలుగు కళాసమితి,మస్కట్, ఒమన్ దేశంలో
  • 2008 లో తెలుగు కళాసమితి,కువైట్, కువైట్ లో
  • 2008 లో తెలుగు అసోషియేషన్,ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ లో
  • 2009 లో ఆంధ్ర ఫిజీషయన్,నార్త్ అమెరికా అసోషియేషన్,దల్లాస్ నందు
  • 2009 లో న్యూజిలాండ్ తెలుగు అసోషియెషన్,అకులాండ్,న్యూజిలాండ్
  • 2010 లో తెలుగు కళాసమితి,దోహా,ఖతర్ నందు
  • 09.04.2010 న తెలుగు స్రవంతి సంస్థ ద్వారా షార్జా లో
  • 06.05.2010 న తెలుగు కళాక్షెత్రం, రియాద్ నందు
  • 07.05.2010 న తెలుగు కళ సమఖ్య,జూబ్లీ(ఎస్.ఎ) నందు
  • 06.02.2011 న ఆంధ్ర మహా సంఘం,యాగూన్,మయన్మార్ నందు
  • 21.05.2011 న తిరుమల తిరుపతి దెవస్థనం,ఉగాండా లిమిటెడ్ కంపాలా, ఉగాండా నందు
  • 25.06.2011 న మలేషియా తెలుగు సంఘం,పాంగన్ కోర్ ఐలాండ్,మలెషియా నందు
  • 27.06.2011 న మలెషియ తెలుగు సంఘం ఎఫో, మలెషియా నందు
  • 28.06.2011 న మలెషియా తెలుగు సంఘం కులిం, మలెషియా నందు
  • 29.06.2011 న మలెషియా తెలుగు సంఘం రవాంగ్, మలెషియా నందు.

చిత్రాల గ్యాలరీ

దస్త్రం:Srinivas mimicry.JPG
వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్
దస్త్రం:Srinivas show 1.JPG
అభినందన సభలో వెంట్రిలాక్విజం చేస్తున్న శ్రీనివాస్
దస్త్రం:Srinivas sanmanam.JPG
స్థానిక బాపూజీ కళామందిర్ లో నన్మాన దృశ్యం
దస్త్రం:Srinivas sanmanam1.JPG
శ్రీనివాస్ దంపతులకు సన్మానం
దస్త్రం:Srinivas award.jpg
honored as mimicry samrat